Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 November 2024, 4:57 pm Posted by : ramakrishna

నేటి నుండి హిందూ చైతన్య రథ యాత్ర

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో విభాగమైన ధర్మజాగరణ సమితి, తెలంగాణ విశ్వాహిందు పరిషత్ భీమ్ గల్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో హిందూ చైతన్య రథ యాత్రను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేడు ఉదయం 8 గంటల కు లింబాద్రి గుట్ట నుండి ఈయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుండి 9 గంటలకు గుట్ట కింది ఒడ్డెర కాలనీ, 10 గంటలకు పల్లికొండ, 11 గంటలకు బాచన్ పల్లి, 12 కు పిప్రి,3 గంటలకు ముచ్కూర్ 4.30 కి బెజ్జోరా, 6 గంటలకు భీమ్ గల్, 7.30 కి బాబాపూర్, 8.30 కు పురానిపేట్ లో ఈ చైతన్య రథయాత్రను నిర్వహించనున్నారు. ప్రతి ఊరిలో ఈ రథ యాత్ర గంట పాటు నిర్వహించనున్నారు. ఈ రథ యాత్ర లో భద్రాచలం విశ్వ ఆత్మనందగిరి స్వామి, నిర్మల్ గీతాఆశ్రమ గురువర్యులు ఆచార్య నరేంద్రలు ప్రసంగాలు ఉంటాయని నిర్వహకులు తెలిపారు. ఇట్టి బృహత్తర కార్యక్రమానికి హిందూ బంధువులందరు తప్పక హాజరు కావాలెనని నిర్వాహకులు కోరారు.