నిషిత డిగ్రీ కళాశాలలో హిందీ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్‌లోని నిషిత డిగ్రీ కళాశాలలో హిందీ పక్షోత్సవంలో (సెప్టెంబర్ 14 నుండి 28 వరకు) భాగంగా బుధవారం హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ హిందీ సేవకులు, హిందీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. వాసాల వరప్రసాద్ గారు “డిజిటల్ మాధ్యమాల్లో హిందీ భాష స్థితి మరియు అవకాశాలు” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ – “ఇప్పుడు హిందీ జాతీయ భాష, రాజభాష అనే హద్దులను దాటి అంతర్జాతీయ...