ఎస్ఆర్ యూనివర్సిటీ ద్వారా ఉన్నత విద్యావకాశాలు
ఎస్ఆర్ యూనివర్సిటీ చాన్స్ లర్ వరదారెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎస్ఆర్ యూనివర్సిటీ ద్వారా ఇంటర్మీడియెట్ తర్వాత ఎన్నో ఉత్తమమైన విద్యా అవకాశాలు ఉన్నాయని వాటిని జిల్లాకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఆర్ యూనివర్సిటీ చాన్స్ లర్, ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏ.వరదారెడ్డి అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎస్ఆర్ యూనివర్సిటీ ద్వారా అందిస్తున్న కోర్సులు, సౌకర్యాలు, ఉన్నత విద్య అవకాశాల గురించి వివరించారు. జాతీయ...