- ఎస్ఆర్ యూనివర్సిటీ చాన్స్ లర్ వరదారెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎస్ఆర్ యూనివర్సిటీ ద్వారా ఇంటర్మీడియెట్ తర్వాత ఎన్నో ఉత్తమమైన విద్యా అవకాశాలు ఉన్నాయని వాటిని జిల్లాకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఆర్ యూనివర్సిటీ చాన్స్ లర్, ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏ.వరదారెడ్డి అన్నారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎస్ఆర్ యూనివర్సిటీ ద్వారా అందిస్తున్న కోర్సులు, సౌకర్యాలు, ఉన్నత విద్య అవకాశాల గురించి వివరించారు. జాతీయ స్థాయిలో ఎన్ఐఆర్ఎఫ్ గుర్తింపు కలిగి జాతీయ స్థాయిలో 98వ ర్యాంకు కలిగిన తెలంగాణలోనే ఏకైక యూనివర్సిటీ ఎస్ఆర్ అన్నారు. ఇంటర్ తర్వాత విద్యార్థులు ఏ విధమైన కోర్సులు తీసుకోవడం ద్వారా భవిష్యత్తు బాగుంటుందనే విషయంలో కెరీర్ గైడెన్స్ ఇచ్చారు. ఎస్ఆర్ యూనివర్సిటీలో బీటెక్ కోర్సులతో పాటు బీఎస్సీ అగ్రికల్చర్, బిజినెస్ స్కూల్, మేజర్ డిగ్రీ, మైనర్ డిగ్రీలు ఒకేసారి పొందే అవకాశం ఉందన్నారు. ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో భాగంగా మూడు సంవత్సరాలు ఇక్కడ, రెండు సంవత్సరాలు అమెరికాలో, రెండు సంవత్సరాలు ఇక్కడ, రెండు సంవత్సరాలు ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. ఎస్ఆర్ఎఎక్స్ ద్వారా నాయకత్వ లక్షణాలు కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు మేనేజ్మెంట్ స్టార్టప్ కంపెనీలను విద్యార్థులు స్థాపించేందుకు పెట్టుబడి కూడా ఎస్ఆర్ యూనివర్సిటీయే పెడుతుందన్నారు. అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని హాస్టల్ వసతి కూడా ఉందని ఈ అవకాశాన్ని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిత, అడ్మిషన్ డైరెక్టర్ శేశగిరిరావు, సీనియర్ డైరెక్టర్ రామ్ దేశముఖ్, తదితరులు విద్యార్థులకు తమ విలువైన సందేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డీజీఎం గోవర్ధన్ రెడ్డి, జోనల్ ఇంచార్జి శ్రీకాంత్, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.