జిజి కళాశాల లో ఉన్నత విద్య ప్రవేశాల సమీక్ష కార్యక్రమాలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : గిరిరాజ్ కళాశాలలో ప్రజాపాలన "విద్యావారోత్సవాల్లో" భాగంగా రెండవ రోజు మంగళవారం యోగా ధ్యానం, పీజీ ప్రవేశాల సమీక్ష వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సమన్వయ కర్తబాలామణి ఆధ్వర్యంలో యోగా శిక్షకులు యోగారత్న ఎక్కొండ ప్రభాకర్ అధ్యాపకులకు, విద్యార్థులకు ప్రత్యేకంగా యోగా శిక్షణను నిర్వహించడమైనది. సమన్వయకర్త జయ ప్రసాద్ ఆధ్వర్యంలో కళాశాలలోని వివిధ విభాగాలు నిర్వహిస్తున్న పీజీ ప్రవేశాల శిక్షణ తరగతులు, విద్యార్థుల పురోగతి తదితర అంశాలను అధ్యాపకులు...