Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 6:54 pm Posted by : ramakrishna

జిజి కళాశాల లో ఉన్నత విద్య ప్రవేశాల సమీక్ష కార్యక్రమాలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గిరిరాజ్ కళాశాలలో ప్రజాపాలన “విద్యావారోత్సవాల్లో” భాగంగా రెండవ రోజు మంగళవారం యోగా ధ్యానం, పీజీ ప్రవేశాల సమీక్ష వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సమన్వయ కర్తబాలామణి ఆధ్వర్యంలో యోగా శిక్షకులు యోగారత్న ఎక్కొండ ప్రభాకర్ అధ్యాపకులకు, విద్యార్థులకు ప్రత్యేకంగా యోగా శిక్షణను నిర్వహించడమైనది. సమన్వయకర్త జయ ప్రసాద్ ఆధ్వర్యంలో కళాశాలలోని వివిధ విభాగాలు నిర్వహిస్తున్న పీజీ ప్రవేశాల శిక్షణ తరగతులు, విద్యార్థుల పురోగతి తదితర అంశాలను అధ్యాపకులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా మ్యాథమాటిక్స్ పీజీ ప్రవేశాల శిక్షణను జీజీ కళాశాల నిర్వహించడం గర్వకారణమని, మ్యాథమాటిక్స్ అధ్యాపకులను ప్రిన్సిపాల్ అభినందించారు.

 

Higher education admissions review programs at GG College

 

సీపీజీఈటీ మ్యాథమాటిక్స్ ఉచితంగా శిక్షణ కోసం ఈ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చని జయప్రసాద్ తెలిపారు. https://chat.whatsapp.com/JCi6yQ4xpc6A21VxqXWT9b?mode=gi_t

కళాశాలలో ప్రస్తుతం 10 పీజీ కోర్సులు కొనసాగుతున్నాయని, మరిన్ని పీజీ కోర్సులు మంజూరు కానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్ రంగరత్నం, ఏ.వో. రామ్ కిషన్, సమన్వయకర్తలు రాజేశ్,  రంజిత, వినయ్ కుమార్, దండు స్వామి, , రామస్వామి, పూర్ణచందర్ రావు, కిరణ్ కుమార్ గౌడ్, ముత్తెన్న, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Higher education admissions review programs at GG College