Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 12:37 pm Posted by : ramakrishna

 జీజీహెచ్ మార్చురీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

 

. . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ అరెస్టు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భీంగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన పోలాస సుధాకర్ మృతదేహాన్ని మంగళవారం బీజేపీ నాయకులు జీజీహెచ్ మార్చురీలో సందర్శించారు. అనంతరం పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్, బీజేవైఎం నాయకులు, కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు.

High tension at GGH mortuary.

దీంతో వారు మార్చురీ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి తీసుకెళ్తుండగా బీజేవైఎం నాయకులు పోలీస్ వాహనాల ఎదుట బైటాయించారు. దీంతో పోలీసులు బీజేవైఎం, కార్పొరేటర్లను సైతం అరెస్టు చేసి నగరంలోని 6వ టౌన్ కు తరలించారు.

High tension at GGH mortuary.