Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 November 2024, 8:08 pm Posted by : ramakrishna

ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు

  •  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ , బతుకమ్మ  : రైతులు ఆయిల్ ఫామ్ సాగుచేసి అధిక లాభాలు పొందాలని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండలంలోని రైతునగర్ రైతు వేదికలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి మళ్లించాలని సూచించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, మండలాధ్యక్షుడు బోయిని శంకర్, మాజీ ఎంపీపీ రఘు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

High profits with oil farm cultivation