Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 March 2026, 6:53 pm Posted by : ramakrishna

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో హైకోర్టు నోటీసులు

 

. . . కేజ్రీవాల్, కవితతో పాటు 23 మందికి తాఖీదులు

 

. . . రౌస్ అవెన్యూ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీబీఐ

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీమాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో పాటు మాజీ మంత్రి సిసోడియా, తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు 23 మందికి రౌస్ అవెన్యూ కోర్టు సాక్ష్యాదారులు లేని కారణంతో గత వారం క్లీన్ చీట్ ఇచ్చి కేసును కొట్టివేసిన విషయం తెల్సిందే.

 

High Court notices in Delhi liquor scam case

 

ఆ కేసుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో కేజ్రీవాల్ తో పాటు మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవితతో పాటు 23 మందికి నోటీసులు జారీ చేసింది. సీబీఐ అప్పిల్ పై ప్రత్యేక కోర్టు చేసిన వ్యాఖ్యలపై స్టే విధించి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. హైకోర్టులో విచారణ జరిగే వరకు ఈడీ కేసు విచారణను వాయిదా వేయాలని లోయర్ కోర్టును ఆదేశించింది.

 

High Court notices in Delhi liquor scam case