Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2025, 8:00 pm Posted by : ramakrishna

శ్రీవారిని దర్శించుకొన్న హైకోర్టు జడ్జి

భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్ర హైకోర్టు జడ్జి గాడి ప్రవీణ్ కుమార్ శుక్రవారం నింబచల లక్ష్మీనృసింహ స్వామి కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు. ఈ సందర్బంగా గ్రామాలయంలో అర్చకులు జడ్జిని స్వామి మెట్ల వద్ద తలపాగా చిట్టి, కొబ్బరికాయ కొట్టించి, పూర్ణకుంభంనిచ్చి, శ్రీసుక్తం పాటిస్తూ ఆలయానికి స్వాగతం పలికారు. అనంతరం గర్భలయంలో ప్రత్యేక పూజలను నిర్వహింపజేశారు. స్వామి వారికి నైవేద్యం, హారతినిచ్చి ఆశీర్వాదించారు. ఈ సందర్బంగా అర్చకులు జడ్జిను వారి కుటుంబ సభ్యులను శేష వస్త్రాలతో సన్మానించి, ఆశీర్వదించారు.

  • హైకోర్టు జడ్జిని సన్మానించిన సర్వ సమాజ్..

రాష్ట్ర హైకోర్టు జడ్జి గాడి ప్రవీణ్ కుమార్ ను భీమ్ గల్ సర్వ సమాజ్  కమిటీ సభ్యులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. నింబచల లక్ష్మీనృసింహ స్వామిని గుట్టపై ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా భీమ్ గల్ కు శాంక్షన్ అయిన కోర్టు పనులను వేగవంతం చేయించాలని జడ్జిని కోరారు.హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ భీమ్ గల్ పట్టణవాసి కావడం విశేషం. జడ్జిని కలిసిన వారిలో  సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షుడు  నీలం రవి,ఉపాధ్యక్షుడు బర్ల మోహన్ ,క్యాషియర్  కాపు కుమ్మరి హరీష్, సెక్రటరీ పర్సా నవీన్,  సలహా కమిటీ సబ్యులు రాగి పవన్, దయ్యా ప్రవీణ్, చింతలూరి దశరథ్ లు ఉన్నారు.

High Court Judge visits Srivari