బూస జనార్దన్ కు బెయిలు మంజూరు చేసిన హైకోర్టు

  . . .  జైలు నుండి విడుదల నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :  మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నాడనే నేరారోపణలో నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు చే పది సంవత్సరాల జైలుశిక్షకు గురైన బూస జనార్ధన్ కు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.పదివేల వ్యక్తిగత పూచికత్తుతో పాటు అంతే మొత్తంలో ఇద్దరి జమానాతు నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో సమర్పించాలని బెయిలు ఉత్తర్వులో పేర్కొన్నది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వ్యక్తిగత బాండ్ తో పాటు...