Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 10:03 pm Posted by : ramakrishna

బూస జనార్దన్ కు బెయిలు మంజూరు చేసిన హైకోర్టు

 

. . .  జైలు నుండి విడుదల

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : 

మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నాడనే నేరారోపణలో నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు చే పది సంవత్సరాల జైలుశిక్షకు గురైన బూస జనార్ధన్ కు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.పదివేల వ్యక్తిగత పూచికత్తుతో పాటు అంతే మొత్తంలో ఇద్దరి జమానాతు నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో సమర్పించాలని బెయిలు ఉత్తర్వులో పేర్కొన్నది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు వ్యక్తిగత బాండ్ తో పాటు ఇద్దరి జమానతు పేపర్స్ న్యాయవాది పరుచూరి శ్రీధర్ కోర్టులో సమర్పించడంతో వాటిని పరిశీలించిన న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ ఆమోదించారు. అనంతరం బూస జనార్దన్ విడుదల చేయాలని నిజామాబాద్ జిల్లా కేంద్ర కారాగార అధికారులకు ఉత్తర్వులు పంపించారు.బెయిలు ఉత్తర్వులు స్వీకరించిన అధికారులు జనార్దన్ ను విడుదల చేశారు.

. . . జైలుశిక్ష, బెయిలు నేపథ్యం

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి నమోదు చేసిన ఒక క్రిమినల్ కేసులో సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన బూస జనార్ధన్ తో పాటు మరికొందరికి మావోయిస్టులతో సంబంధాలు వారికి పేలుడు పదార్థాలు సరఫరా చేసున్నారనే నేర అభియోగాలు మోపారు. కాని కోర్టు విచారణలో కేవలం పేలుడు పదార్తాల ఆరోపణ మాత్రమే రుజువు కావడంతో పేలుడు పదార్తాల చట్టంలోని సెక్షన్ ప్రకారం పది సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు ఐదువేల రూపాయల జరిమానా విదిస్తూ నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్ 2026 సెప్టెంబర్ 28 న తీర్పు వెలువరించిన విషయం విధితమే దీనిని సవాలు చేస్తూ జనార్ధన్ హైకోర్టులో అప్పీలు దాఖలు చేయడంతో బెయిలు మంజూరు అయింది. అప్పీలు పరిష్కారం అయ్యే వరకు బెయిలు ఉత్తర్వు అమలులో ఉంటాయి.సెప్టెంబర్ 28 తేదీ నుండి జనార్ధన్ జైలులోనే ఉన్నారు.