హైదరాబాద్, బతుకమ్మ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు అభ్యంతరం తెలపకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ న్యాయ నిపుణులతో చర్చలు చేపట్టింది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇటీవల స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రకియలో జోక్యం చేసుకోలేదని న్యాయ స్థానం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జీవో 9, 41 పై మాత్రమే మధ్యంతర స్టే ఇచ్చినట్లు పేర్కొంది. ఓపెన్ కేటగిరిలో సీట్లను నోటిఫై చేసి దామాషా ప్రకారం పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు సూచించింది. తెలిపింది. ఈక్రమంలో న్యాయ నిపుణులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్చలు చేపట్టింది. వారి సూచన మేరకు తదుపరి నిర్ణయం తీసుకోనుంది. అలాగే స్థానిక ఎన్నికల నిర్వహణ స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరనున్నట్లు తెలుస్తోంది.