Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 8:09 pm Posted by : ramakrishna

న్యాయమైన పని వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది

 

. . . జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ టి.నాగరాణి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ఒక కార్మిక చట్టం సమతుల్యమైన, న్యాయమైన పని వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ టి.నాగరాణి అన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మే డే సందర్భంగా కామారెడ్డి లో నిర్వహించిన కార్యక్రమంలో నాగరాణి మాట్లాడుతూ కార్మిక చట్టం అనేది యజమానులు, కార్మికుల మధ్య సంబంధాన్ని నియంత్రించే ఒక చట్టమన్నారు. ఇది న్యాయమైన ప్రవర్తన, భద్రత, సరైన పని పరిస్థితులను నిర్ధారిస్తుందన్నారు. కార్మికుల హక్కులను పరిరక్షించడం, సురక్షితమైన పని ప్రదేశాలను నిర్ధారించడం, దోపిడీని నివారించడం, ఉద్యోగ నిబంధనలను నియంత్రించడం, ఉద్యోగులు, యజమానుల మధ్య వివాద పరిష్కారాన్ని అందించడం అని తెలిపారు. భారతదేశంలో ఫ్యాక్టరీల చట్టం 1948, కనీస వేతనాల చట్టం 1948, వంటి చట్టాలు పని పరిస్థితులు, వేతనాలను నియంత్రిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కమర్, వాణి బీడీ కంపెనీ మేనేజర్ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.