Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 9:19 pm Posted by : ramakrishna

విద్యార్థినికి హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ చేయూత

 

. . . లక్ష రూపాయల చెక్కు అందజేత

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

చదువులో ఎంతో ప్రతిభను ప్రదర్శిస్తూ, ఉన్నత విద్యార్జన కోసం ఫీజు చెల్లించే స్థోమత లేక  ఇబ్బందులు పడుతున్న నిరుపేద విద్యార్థినికి  రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక చేయూతను అందించి తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన ఎం.కీర్తి బాసర ట్రిపుల్ ఐటీలో  సివిల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నిరుపేద కుటుంబం కావడంతో ఆమె రూ. 2.10 లక్షల ఫీజు బకాయిలు చెల్లించే స్థోమత లేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విషయం తెలుసుకున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సదరు విద్యార్థినికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో లక్ష రూపాయల చెక్కును బుధవారం ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు, కలెక్టర్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు రమణ్ రెడ్డి, మహేష్, శ్రీనివాస్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.