అనాథ ఆశ్రమానికి హెల్పింగ్ హాండ్స్ వితరణ

బతుకమ్మ, వేల్పూర్ :- మండలంలోని జంగంపేట గ్రామానికి చెందిన హెల్పింగ్ హాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని తపస్వితేజ నిలయం అనాధాశ్రమానికి ఆదివారం నిత్యవసర వస్తువులు వితరణ చేశారు. ఆశ్రమంలో సెమీ క్రిస్మస్ వేడుక నిర్వహించారు. జానకంపేట ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ నోవా క్రిస్మస్ సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్ సంస్థ సభ్యులు జేమ్స్ గంగారెడ్డి, జి జి గంగారెడ్డి, జ్యోతి కుమార్, దాస్ స్టీవెన్, కిరణ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.