ప్రతిభావంతులకు తోడుగా ‘హెల్పింగ్ హాండ్స్’

  వేల్పూర్, బతుకమ్మ :   వేల్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. పదో తరగతి ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన రేగుల రిషిక, రెండో స్థానంలో నిలిచిన మానేపల్లి శ్రీనిజ, మూడో స్థానంలో నిలిచిన సేరు అనన్యలకు నగదు ప్రోత్సాహకాలు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్...