Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 January 2026, 4:23 pm Posted by : ramakrishna

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ శ్రీరామరక్ష

రుద్రూర్, బతుకమ్మ :

 

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ శ్రీరామ రక్షలాంటిదని ఎస్సై పి.సాయన్న అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ శ్రీరామరక్ష అని సూచించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

Helmets for two-wheeler riders: Sri Ramaraksha
Helmets for two-wheeler riders: Sri Ramaraksha