కొత్త కలెక్టరేట్ లోకి వెళ్లాలంటే హెల్మెట్ తప్పనిసరి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : కొత్త కలెక్టరేట్ ప్రవేశానికి వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అని ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఏసీపీ కొత్త కలెక్టరేట్ లో ఉద్యోగులతో మాట్లాడుతూ హెల్మెట్ లేకపోతే లోపటికి అనుమతించమని తెలిపారు. ఏడాది పాటు చాలామంది రోడ్డు భారీన పడి చనిపోతున్నారని కావున హెల్మెట్ కచ్చితంగా ధరించాలని ఏసిపి సూచించారు. కావున ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా హెల్మెట్ కచ్చితంగా ధరించి సామాన్య ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలని, హెల్మెట్ లేకపోతే లోనికి అనుమతించమన్నారు. రోడ్డు...