24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
హైదరాబాద్, బతుకమ్మ : వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీరాల సమీపంలో ఆగస్లు 19 మధ్యాహ్నానికి తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ తెలంగాణ పై ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం వాయువ్య బంగాళాకాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, రుతుపవన ద్రోణి, ఉపరీతల ఆవర్తనం కారణంగా వచ్చే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని...