భారీ వర్షాలతో తెగిన ఇందల్వాయి పెద్దగచ్చు

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో గల  పెద్ద చెరువులోకి గత మూడు రోజులుగా  భారీ వర్షాలు కురవడంతో వరద ప్రవాహం రావడంతో చెరువు అలుగుపై నుండి,పక్కనే గండి నుండి భారీ నీరు వచ్చి గచ్చులోకి చేరడంతో శుక్రవారం పెద్దగచ్చు తెగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. పెద్ద చెరువులోకి ఇప్పటికీ భారీ వరద రావడంతో నిండుకుండలా నిండి ఆందోళనకరంగా మారింది.