Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 August 2025, 6:36 pm Posted by : ramakrishna

పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద

 

 నాగిరెడ్డిపేట, బతుకమ్మ :

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యం నిండటంతో నీటిని దిగువకు వదులుతున్నారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు భారీగా వరద వచ్చి చేరుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షం పడుతుండడంతో ఒక లక్ష 15 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి రావడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1.82 టి యం సి లు. ప్రస్తుతం ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద  బుంగ ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. ఏ క్షణమైనా ప్రాజెక్ట్ కు ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు అని  బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు స్థానికంగా ప్రాజెక్టు కింద గ్రామాల ప్రజలు.