. . రెండుటన్నుల రేషన్ బియ్యం పట్టివేత
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
నిజామాబాద్ నగరంలో పిడియస్ గోదాంపై ఓకటవ టౌన్ పోలిసులు దాడి చేశారు. శనివారం రాత్రి విశ్వసనీయ సమచారం మేరకు వన్ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి అధ్వర్యంలో పోలిసులు నగరంలోని అశోక్ నగర్ ప్రాంతంలోని సుల్తాన్- సుమేర్ అను ఇద్ధరు పిడియస్ దందా నిర్వహకులకు సంబందించిన గోదాం ముందు డిసియం ( ఎపి 02 ఎక్స్ 5752 ) లారీలో లోడ్ చేస్తుండగా దాడి చేసి 2024 కిలో సుమారు రెండు టన్నుల బియ్యంను పట్టుకున్నారు. స్థానికంగా ప్రజల నుంచి రేషన్ దుకాణాల నుంచి సేకరించిన బియ్యంను లారీలలో, డిసీయంలలో రిసైక్లింగ్ కోసం లేదా మిల్లులకు, పోరుగు రాష్ర్టాలకు తరలించడం ఇక్కడ నిత్యం జరిగే తంతు. గత నెలలో సుల్తాన్ అండ్ సుమేర్ సోధరులపై మాక్లూర్ పోలిస్ స్టేషన్ లో విజయలక్ష్మి ఇండస్ర్టీస్ నిర్వహకుల పిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యాయి. నెలరోజుల వ్యవధిలో రెండోసారి పోలిస్ లకు పిడిఎస్ దందా నిర్వహకులు పట్టుబడటం విశేషం.
