ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : జై గౌడ ఉద్యమ జిల్లా అధ్యక్షులు పందిర్ల లింగం గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి గంట వెంకటేష్ గౌడ్ లను శనివారం ఏజిపి పసుల కృష్ణ కార్యాలయంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారికి ఏజీపీ పసుల కృష్ణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసయ్య, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఏం సి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, నాయకులు బండారి బాల్రెడ్డి,ఎడ్ల రాజ్ కుమార్,కంచర్ల రాజు, గంట బుచ్చాగాడ్,గంట అంజగౌడ్, గుల్పెల్లి పద్మా రెడ్డి ,పందిర్ల శ్రీనివాస్ గౌడ్, అంతేర్పుల గోపాల్, మిర్యాల్ కర్ రాజేష్ , చెట్కూరి తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.