పదోన్నతిపై బదిలీ అవుతున్న సైనిక సంక్షేమ సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న బదాం గంగా మోహన్ పదోన్నతితో మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయానికి బదిలీ కావడంతో బుధవారం ఆయనకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి బి. పవన్ కుమార్ అధ్యక్షత వహించగా, కార్యాలయ సిబ్బంది, నిజామాబాద్ జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు,...