Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 2:57 pm Posted by : ramakrishna

వక్ఫ్ చట్టం చట్ట బద్ధతపై సుప్రీంలో విచారణ వాయిదా

డిల్లీ, బతుకమ్మ : వక్ఫ్ చట్టం చట్ట బద్ధతపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.  వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో 73 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో గురువారం విచారణ జరిగింది. వక్ఫ్ పై సమాధానం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజులు గడవు కోరింది.  తదుపరి విచారణ వరకు వక్ఫ్ ఆస్తులను డీ నోటిఫై చేయబోమని కేంద్రం కోర్టుకు తెలిపింది. అప్పటివరకు వక్ఫ్ కౌన్సిల్ లో ముస్లిమేతరులను సభ్యులుగా  నియమించొద్దని విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం మే 5కు వాయిదా వేసింది.