హైకోర్టులో బీసీ బిల్లుపై విచారణ వాయిదా
నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : తెలంగాణలో బీసీ 42% రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్ ఏకే సింగ్ నేతృత్వంలోని హైకోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ పలు అంశాలు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈమేరకు ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన నోటిఫికేషన్ కాపీ కోర్టుకు అందజేశారు. ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదన్నారు. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబరు...