Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 June 2025, 5:07 pm Posted by : ramakrishna

శరీరాన్ని ఆరోగ్యంగా.. మనసును ప్రశాంతంగా..

మోర్తాడ్, బతుకమ్మ: శరీరాన్ని ఆరోగ్యంగా మనసును ప్రశాంతంగా ఉంచే శక్తివంతమైన సాధనమే యోగ అని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు సంతోష్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో యోగా ఆసనాలు వేయించి ఆసనాల ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. ప్రతిరోజు యోగ చేయడం అనేది జీవితంలో ఎంతో ముఖ్యమని యోగ వల్ల ఆరోగ్యతో పాటు మనసు అనేది ఎంతో ప్రశాంతంగా ఉంటుందని వివరించారు. ప్రతి వ్యక్తి  యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.