యోగా సాధనతో ఆరోగ్యం
నిజామాబాద్, బతుకమ్మ : యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఆరోగ్య రక్ష నేచర్ క్యూర్ యోగా ట్రైనర్ డాక్టర్ ఐశ్వర్య అన్నారు. జేసీఐ వారోత్సవం సందర్బంగా గురువారం డాక్టర్ ఐశ్వర్య ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా శారీరక ధారుఢ్యం, మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాలు యోగా కు కేటాయించాలని కోరారు. కార్యక్రమం లో జేసీఐ ఇందరు అధ్యక్షులు గౌతమి పెండోటి...