Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 7:07 pm Posted by : ramakrishna

క్రీడలతోనే ఆరోగ్యం దేదీప్యమానం  

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

మానవ జీవితంలో క్రీడలు ప్రధాన పాత్ర పోషిస్తాయనితెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అన్నారు.నిజామాబాద్ఆఫీసర్ క్లబ్ షటిల్ కోర్ట్ నూతనంగా ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్ ను ఆదివారంసాయంత్రం క్లబ్ కార్యదర్శి స్వామీ దాస్, సంయుక్త కార్యదర్శి డాకం సాయిలు, కోశాధికారి కౌడపు శరత్, మేనేజింగ్ కమిటీ సభ్యులు సత్యనారాయణ, ఏటీఎస్ శ్రీనివాస్, క్లబ్ మేనేజర్ సురేష్ కుమార్ లతో కలిసి తాహెర్ బిన్ హందాన్ ప్రారంభించారు.అనంతరం  తాహెర్ మాట్లాడుతూ..క్రీడలుక్రీడాకారుల ప్రతిభను దేదీప్యమానం చేస్తాయని ఆయన తెలిపారు. క్లబ్ సభ్యుల శారీరకశ్రమకు మరింత పదును పెట్టడానికి నూతన గ్రీన్ మ్యాట్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.క్లబ్ అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.క్లబ్ ప్రాంగణమంతా ఆధునీకరించాల్సినఆవశ్యకత ఉన్నదని ఆ దిశగా క్లబ్ ఉపాధ్యక్షునిగా తన వంతు కృషి చేస్తానని ఆయనతెలిపారు. నిజామాబాద్ ఆపీసర్స్ క్లబ్ కు వన్నెతెస్తానని, అందుకు సభ్యుల తోడ్పాటు కావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులురచ్చ మురళి, డాక్టర్ రాములు,అంగీరేకుల సాయిలు, ఆశ నారాయణ, రవిరాజ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.