చిన్న వయస్సులోనే వివాహాల వల్ల ఆరోగ్య సమస్యలు

బోధన్, బతుకమ్మ :  చిన్న వయస్సులోనే వివాహాలు జరగడం వల్ల ఆడ పిల్లలు అనారోగ్యం పాలవుతారు. చిన్న వయస్సులోనే సంబంధిత, సంపర్కంతో బాటు గర్భవతులు కావడం, దీనితోబాటు హెచ్‌.ఐ.వి, రక్త హీనత సోకడానికీ, భగంధరమనే వ్యాధి రావడానికి ( సన్నని నాళంలా వ్యాపించే కురుపు) ఎక్కువ అవకాశం ఉందని డీహెచ్ఈడబ్ల్యూ జిల్లా మిషన్ సమన్వయ కర్త పి.స్వప్న అన్నారు. భారత ప్రభుత్వం పిలుపు మేరకు మహిళ శిశు దివ్యాంగుల,  వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో  బోధన్ మండలంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల(జూనియర్ కళాశాల) విద్యార్థిని విద్యార్థులచే...