Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2024, 7:07 pm Posted by : ramakrishna

ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యమేళా

162 మందికి వైద్య పరీక్షలు  

ధర్పల్లి, బతుకమ్మ: గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులతో  ప్రతినెల రెండవ శనివారం ఆరోగ్య మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆరోగ్యమేళకు విశేష  స్పందన లభించిందని  ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా  వైద్యులు మాట్లాడుతూ జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో దగ్గు, దమ్ము,  ఊపిరితిత్తుల సంబంధిత వైద్యులు డాక్టర్ బల్వీర్ సింగ్ ఆరోగ్యమేళా నిర్వహించారు. ఈ ఆరోగ్యమేళాకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఇందులో ఛాతీ,దగ్గు, దమ్ము,  ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల రోగులు మొత్తం  162 మందికి  వైద్య పరీక్షలు నిర్వహించి రక్త పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులను ఉచితంగా ఇచ్చి తగిన సలహాలు ఇచ్చారు. ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది ఉంటే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ కి వచ్చి చూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక వైద్యులు డాక్టర్.బల్వీర్ సింగ్, నర్సింగ్ ఆఫీసర్ మమత,సుజాత,సిబ్బంది భూలక్ష్మి, కృష్ణ,మురళి, పద్మ,సంతోష్, వాజీద్,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.