Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 5:32 pm Posted by : ramakrishna

ఆరోగ్యమే ప్రతి కుటుంబానికి నిజమైన సంపద

 

. . . చిల్లర్గి లో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం

 

. . . ఎమ్మెల్యే సతీమణి తోట అర్చన

 

జుక్కల్, బతుకమ్మ :

 

ప్రజల ఆరోగ్యమే వారి కుటుంబానికి నిజమైన సంపద అని, ఉచిత వైద్య శిబిరం లాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని జుక్కల్ ఎమ్మెల్యే సతీమణి తోట అర్చన అన్నారు. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామంలో నిర్వహిస్తున్న ఉచిత మెగా ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సతీమణి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తోట అర్చన శిబిరంలోని వైద్య సేవలను పరిశీలించి, వైద్య బృందాన్ని అభినందించారు.

 

Health is the true wealth for every family.

 

మెగా ఆరోగ్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నారన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆరోగ్య సేవలను పొందుతున్నారని, ప్రజల విశేష స్పందనతో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. అదే విధంగా నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారన్నారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే మహోన్నత సేవలో భాగస్వాములు కావడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా కొనసాగుతున్నాయి. జన్మదిన వేడుకలను సేవా దినోత్సవంగా నిర్వహించడం పట్ల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Health is the true wealth for every family.