ఆర్ బి ఎస్ కే ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కోట గల్లి శంకర్ భవన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. సీజనల్ వ్యాధులతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ భాస్కర్ తెలిపారు. ముఖ్యంగా కంటిచూపు సమస్యలు, చర్మం, చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలు,...