Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 December 2024, 6:40 pm Posted by : ramakrishna

గుండారం ప్రభుత్వ పాఠశాల లో ఆరోగ్య చైతన్య కార్యక్రమం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా గుండారం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల లో శుక్రవారం ఇన్సిట్యూట్ ఆఫ్ గ్లోబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఆరోగ్య చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. అట్టి సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కె. నవీన్, డా. హుమేరా, జి. హేమ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సాయిలు, డాక్టర్ కవిత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అవసరమని అధికారులు తెలిపారు.

Health Awareness Program in Gundaram Government School.