రుద్రూర్, బతుకమ్మ : ప్రాంతీయ చెరుకు మరియు వరి పరిశోధన స్థానం అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన డా.పవన్ చంద్ర రెడ్డిని సోమవారం తెలంగాణ ఉద్యమకారుడు తిగుళ్ల రాజా వరప్రసాదరావు, మాజీ ఉపసర్పంచ్ నీరడి శంకర్ లు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పరిశోధన స్థానానికి పూర్వ వైభవం తెస్తానని, పరిశోధన స్థానం అభివృద్ధికి అహర్నిశలు సమయంతో పని లేకుండా కష్టపడతానని ఆయన తెలిపారు.