Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 4:45 pm Posted by : ramakrishna

బందోబస్థ్ లో ఉండగా హెడ్ కానిస్టేబుల్ కు గుండెపోటు

 

. . . ఆస్పత్రికి తరలించే సరికి  మృతి

 మోపాల్, బతుకమ్మ:

మోపాల్ మండలం గుడి తాండాలో జరుగుతున్న గ్రామ సభ  లో బందోబస్థ్ కు వెళ్లిన మోపాల్ పిఎస్ హెడ్ కానిస్టేబుల్ అంకడి గంగాధర్ (55) ఛాతినోప్పి( గుండేపోటు) తో కుప్ప కులాడు. అతడిని తోటి పోలీసులు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. విధి నిర్వహణలో తమతో పాటు అప్పటి వరకు ఉన్న హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గుండెపోటుకు గురై చనిపోవడం పోలీస్ శాఖను షాక్ కు గురి చేసింది.. నిజామాబాద్ నగరంలోని న్యాల్ కల్ రోడ్డు లో నివాసం ఉండే అంకిడి గంగాధర్ ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ యోగా కసరత్తులు చేసేవారు. రెండు సంవత్సరాల క్రితం గంగాధర్ తనయుడు డిచ్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కుటుంబ పెద్దను కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. విషయం తెలిసిన పోలీస్ ఉన్నతాధికారులు జీజీహెచ్ లో గంగాధర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గంగాధర్ సోదరుడు సైతం పోలీస్ శాఖలో పని చేస్తున్నట్టు తెలిసింది