పొలిస్ స్టేషన్ అవరణలో ఉరివేసుకుని హెడ్ కానిస్టెబుల్ ఆత్మహత్య
మెదక్, బతుకమ్మ:
తాను పని చేస్తున్న పొలిస్ స్టేషన్ అవరణలో హెడ్ కానిస్టెబుల్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన అదివారం ఉదయం వెలుగు లోకి వచ్చింది. కొల్చారం పొలిస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయికుమార్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం రాత్రే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. గత వారం కొల్చారంకు చెందిన భిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్ కామారెడ్డి జిల్లాలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.