Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 August 2025, 3:13 pm Posted by : ramakrishna

కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారు

 

. . . ఎమ్మెల్యే సుధర్శన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు  వేడుకలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి , నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు.  ఈసందర్బంగా కేక్ కట్ చేసి సార్ కు శుభాకాంక్షలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్సి శంకర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని  మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కష్టకాలంలో పార్టీకి వెంటనే నిలబడి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా శ్రేయస్సు కొరకు  ఆలోచించే వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో అనుభవగ్నులు సుదర్శన్ రెడ్డి  ఆలోచనలు పార్టీ కి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి, కేశ వేణు మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత వారిదేనని,అల్లి సాగర్,గుత్ప ఎత్తిపోతల పథకం లక్ష ఎకరాలకు సాగునీరు తాగునీరు తీసుకొచ్చిన జిల్లాకు చేసిన సేవలు గుర్తు చేస్తూ కొనియాడారు. అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఇంజనీరింగ్ కళాశాలలో సుదర్శన్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది అని అన్నారు

ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంత రెడ్డి రాజా రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ , యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల ఉష, పూర్ణ, మాజీ కార్పొరేటర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

He worked hard to bring the party to power by supporting the workers.