కష్టనష్టాల్లో భాగస్వామ్యులై ప్రజానాయకునిగా గుర్తింపు పొందారు

  . . . అదనపు డీసీపీ జి. బస్వారెడ్డి   . . . పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకల నిర్వహణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దుద్దిళ్ల శ్రీపాదరావు సౌమ్య మనస్తత్వం గల నాయకుడిగా ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టనష్టాల్లో భాగస్వామ్యులై ప్రజానాయకునిగా గుర్తింపు పొందారని అదనపు డీసీపీ జి.బస్వారెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు డీసీపీ(అడ్మిన్) జి. బస్వారెడ్డి ఆధ్వర్యంలో...