దేవుళ్ల సాక్షిగా హామీ ఇచ్చి ఎగ్గొట్టారు
హైదరాబాద్, బతుకమ్మ: ఎన్నికల సమయంలో రైతులకు రుణ మాఫీ చేస్తానని ఎక్కడి వెళ్తే అక్కడి దేవుళ్లపై ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు ఎగ్గొట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసన మండలిలో గురువారం ఆమె మాట్లాడారు. రైతులకు రుణమాఫీ హామీని నెరవేర్చనందుకు నిరసనగా ఆకుపచ్చ కండువాలు కప్పుకుని మండలికి వచ్చామన్నారు. 2024 ఏప్రిల్ 20న ఏడుపాయల దుర్గమ్మపై, అదే నెల 21న యాదగిరి లక్ష్మీనర్సింహస్వామిపై, 22న బాసర సరస్వతీ అమ్మవారిపై, 23న జోగులాంబ అమ్మవారిపై, 24 రామప్ప దేవాలయం శివయ్యపై,...