Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 11:14 am Posted by : ramakrishna

 పరారీలో ఉన్నాడు

 

. . . బండి భగీరథ్ కనిపించడం లేదు

. . . ఇందూర్ లో వెలసిన పోస్టర్లు

 నిజామాబాద్, బతుకమ్మ:

కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పరారీలో ఉన్నాడు అంటు పోస్టర్ నిజామాబాద్ లో వెలిసాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో పరారీలో ఉన్నాడు అంటు పోస్టర్లను గుర్తు తెలియని పోస్టర్లను గోడలకు అతికించారు. శుక్రవారం తెల్లవారే సరికి జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో తనయుడి పోటోలు ముద్రించిన పోస్టర్లు వెలిశాయి. ఆచూకీ తెలిస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి అంటు వెలసిన పోస్టర్లు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంబంధిత పోస్టర్లను ఎవరు వేశారు అనేది తెలియలేదు. ఇప్పటికే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతి పక్షాలు బండి భగీరథ్ ను అరెస్టు చేయాలని, కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో జిల్లాలో బండి భగీరథ్ పరారీ పోస్టర్లు వెలియడంలో దాని వెనుక ఎవరు ఉన్నారు అనే చర్చ మొదలైంది….

He is absconding

ఈ నెల 8 బండి భగీరథ్ మీద పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ పర్యటన అనంతరం బండి భగీరథ్ కేసును తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం సీట్ ను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపిఎస్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించింది.నాటి నుంచి బండి భగీరథ్ పరారీలో( అబ్ స్కాండింగ్ )లో ఉన్నారని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటివల పోలీస్ శాఖ నోటీసులు జారీ చేయగా తనకు రెండు రోజుల గడువు కావాలని పోలీసులకు బండి భగీరథ్ మెయిల్ చేసిన విషయం తెలిసిందే. గురువారం హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో బండి భగీరథ్ కనపడటం లేదని పోస్టర్ వెలిసి కలకలం రేపాయి.  ఈ నెల 14న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరుగగా వారం రోజులు వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగే సమయంలో బండి భగీరథ్ కనిపించడం లేదని పోస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా వెలిసినట్లు ప్రచారం జరుగుతుంది.. పోస్టర్ల యుద్ధం వెనుక ప్రతిపక్షాల పాత్ర ఉందా, ప్రజా సంఘాల ప్రమేయం ఉందా లేక సొంత పార్టీ నేతలే బండి సంజయ్ కు చెక్ పెట్టేందుకు గుర్తు తెలియని వ్యక్తుల మాదిరిగా పోస్టర్లు అతికించి ఉంటారనే ప్రచారం జరుగుతుంది. పోలీసులు మాత్రం పోస్టర్లను అతికించడం ఎవ్వరి పని అనేది తెలియదంటున్నారు.