హెచ్సీయూ భూములను కాపాడాలి
ఛలో సెక్రటేరియట్ విజయవంతం చేయండి బీవీఎం రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ కామారెడ్డి, బతుకమ్మ : హెచ్సీయూ భూములను కాపాడాలని నిర్వహిస్తున్న ఛలో సెక్రటేరియేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జివిఎం విఠల్ కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారతీయ విద్యార్థి మోర్చా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఙివియం విఠల్ మాట్లాడుతూ హెచ్.సి.యు. భూములను పెట్టుబడిదారులకు అప్పగించే ఆలోచనలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం విరమించుకోవాలి...