హెచ్​సీయూ భూములను కాపాడాలి

బాన్సువాడ, బతుకమ్మ  : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన 400 ఎకరాల భూమిని విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు మోచి గణేష్ డిమాండ్ చేశారు.బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు.అనంతరం డీఏవో సువర్ణ కు వినతిపత్రం అందజేశారు.భూమి ఆక్రమణ వల్ల యూనివర్సిటీ అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, భూమిని తిరిగి యూనివర్సిటీ ఆధీనంలోకి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు మోచి గణేష్, శివ సూరి, గాండ్ల కృష్ణ, అనిల్, జీవన్, సంజీవ్ యాదవ్, శంకర్, గౌస్ తదితరులు...