Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 January 2025, 11:01 pm Posted by : ramakrishna

వీఆర్కే జూనియర్ కళాశాలలో హెచ్సీఎల్ టెక్ బీ ఎంపిక పరీక్ష

  • ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని వీఆర్కే జూనియర్ కళాశాలలో గురువారం హెచ్సీఎల్ ఆధ్వర్యంలో టెక్ బీ కోర్స్ కోసం ఎంపిక పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ టెస్ట్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. హెచ్సీఎల్ ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ మొదటగా వీఆర్కే జూనియర్ కళాశాలలో  ఇలాంటి కోర్సునిర్వహించడం ఎంతో  హర్షించదగ్గ విషయమని తెలిపారు. విద్యార్థులు ఈ పరీక్ష లో ఎంపికైతే హెచ్సీఎల్ లో ఐటీ జాబ్ తో పాటు ప్రముఖ సంస్థ నుండి బి టెక్ పూర్తి చేయవచ్చని తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎం.జైపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకి బంగారు భవిష్యత్తుని అందించేటటువంటి కోర్సులకి ఆర్కే విద్యాసంస్థలు ఎల్లప్పుడు మొదటి ప్రాధాన్యత ఇస్తాయని విద్యార్థులు దీనిని ఉపయోగించుకుని భవిష్యత్తులో ఉత్తమ రంగాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శంకర్, దత్తాత్రి, నవీన్,  శివాజీ రావు, శ్రీ వాణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

HCL Tech B Selection Test at VRK Junior College