బట్టపూర్ – ఏర్గట్ల రహదారిపై ప్రమాదకర చెట్లు

  . . . భయాందోళనలో వాహనదారులు   ఏర్గట్ల, బతుకమ్మ :   ఏర్గట్ల మండల కేంద్రం నుంచి బట్టపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి వెంట ఉన్న ప్రమాదకర చెట్లు వాహనదారులు, స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో రహదారికి ఇరువైపులా నాటిన చెట్లలో కొన్ని ప్రస్తుతం గాలులు, వర్షాల కారణంగా విరిగిపడే స్థితికి చేరుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. రోడ్డుకు ఆనుకుని ప్రమాదకరంగా వంగి ఉన్న చెట్ల వద్దకు చేరుకున్న ప్రతిసారీ వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. కొందరు చెట్లు ఎప్పుడు...