Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 12:12 pm Posted by : ramakrishna

సర్పంచ్ గా గెలిచి హామీలు నెరవేర్చి

మద్నూర్, బతుకమ్మ :   మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామానికి చెందిన యం. రాజేశ్వర్ గౌడ్ సర్పంచ్ గా గెలిచేందుకు తన సొంత హామీలను ప్రకటించారు.  గ్రామంలో ఎవరు చనిపోయిన రూ.5000 ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు. సర్పంచ్ గా గెలిచి సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను చేపట్టారు. 18 డిసెంబర్ 2025 న అనారోగ్యంతో  హుస్సేన్ చనిపోయారు. దీంతో అతడి కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించి  రూ.5000 ఆర్థిక సహాయాన్ని  ఉపసర్పంచ్ అమృత్ వార్ బాలరాజ్ చేతుల మీదుగా అందించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.