హైదరాబాద్, బతుకమ్మ : ఎల్బీనగర్ నియోజకవర్గం లోని చంపాపేట్ డివిజన్ కర్మన్ ఘాట్ క్రాంతి నగర్ లో నూతనంగా హర్ష డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ను స్థానిక కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దంత వైద్య సెంటర్ ను ప్రారంభించినందుకు అభినందనలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చే స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ హర్షవర్ధన్,డాక్టర్ గీర్వాణి మాట్లాడుతూ మా వద్ద నాణ్యమైన చికిత్స అందించబడుతుంది.దంతాలకు సంబంధించిన నూతన సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.