Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 February 2025, 4:36 pm Posted by : ramakrishna

పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు

సీఎల్పీ సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, బతుకమ్మ :  పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం సీఎం అధ్యక్షతన జరిగిన సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈసందర్భంగా పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ విధానాలపై అనుమానాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. బహిరంగగా ఎలాంటి విమర్శలు చేయొద్దు అని తెలిపారు. మెజారిటీ స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేయాలని పేర్కొన్నారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చించారు. ఈరెండు చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వీటిపై రెండు బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు.