హరీశ్ రావుకు పితృవియోగం

హైదరాబాద్, బతుకమ్మ :  మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది.  వృద్ధాప్య సమస్యలతో హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు.  సత్యనారాయణ రావు పార్థివ దేహాన్నిహైదరాబాద్ లోని క్రిన్స్ విల్లాస్ లో ఉంచారు. సత్యనారాయణ రావు మృతిపై  మాజీ సీఎం కేసీఆర్,  మాజీ మంత్రి కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.